న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కెమెరాల వినియోగానికి, సరుకుల రవాణాకు, మందులు అందజేయటానికి డ్రోన్లు వాడిన సందర్భాలు అనేకం. అదే డ్రోన్ మనిషిని కూడా మోసుకెళ్తే! అలా అలా గాల్లో తేలియాడుతూ వెళ్తుంటే!.. ఏదో ఒక రోజు ఆ కల నిజం అవుతుందని అనుకొంటూనే ఉన్నాం.
అన్నట్టే, డ్రోన్‌తో సవారీ చేసే అవకాశం కలగబోతున్నది. అవును! మనిషి ఎగిరే డ్రోన్ రెడీ అయ్యింది. దీన్ని త్వరలోనే భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు. పుణెకు చెందిన స్టార్టప్ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. 100 కిలోల బరువును మోయగల సామర్థ్యం, 25-30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సత్తా ఉన్న ఈ డ్రోన్‌కు ‘వరుణ’ అని పేరు పెట్టారు.