మినీకాయ్ (లక్షద్వీప్), మార్చి 6: వ్యూహాత్మక నౌకా స్థావరమైన ఐఎన్ జటాయును లక్షద్వీప్ దీవుల్లోని మినీకాయ్ ద్వీపంలో భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. పశ్చిమ అరేబియా సముద్రంలో యాంటీ పైరసీ, యాంటీ నార్కోటిక్స్ కార్యకలాపాల నియంత్రణలో ఈ నౌకస్థావరం దేశ నావికాదళానికి సహాయ పడుతుంది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ కొత్త స్థావరాన్ని ప్రారంభించారు.