పనాజీ : గోవాకు చెందిన ఓ ఆర్టిస్ట్ పురాణాల స్పూర్తితో మైథాలజీ థీమ్‌తో కూడిన అవుట్డోర్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. పలువురిని ఆకట్టుకుంటున్న ఈ జిమ్‌ను ఆర్టిస్ట్ దీప్తేజ్ వెర్నెకర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తాను గోవాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిపెరిగానని, అక్కడ పలు కళారూపాలను చూస్తూ ఎదిగానని వెర్నెకర్ చెప్పుకొచ్చారు.
ఈ కళారూపాలను తయారుచేసి ప్రతి ఏటా పర్వదినాల్లో ఉపయోగించే వారని గుర్తుచేసుకున్నారు. దేశ సంస్కృతిని, జానపదాలను కాపాడుతూ స్ధానిక కళాకారులు, చేతివృత్తులవారు కళాకృతులను తయారుచేయడంలో నిమగ్నమవుతున్నారని అన్నారు. స్ధానిక కళాకారులు డిజైన్ చేసిన బొమ్మలు, పురాణ పాత్రలు, కళాకృతులను అవుట్డోర్ జిమ్ పరికరాలపై వాడటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్‌ను ఇప్పటివరకూ 12,000 మందికి పైగా వీక్షించగా ఫిట్నెస్ను మైథాలజీతో జత చేసిన ఆర్టిస్ట్ వినూత్న శైలిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.