Sebin Saji | న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను తయారుచేసిన భారతీయుడు సెబిన్ సాజి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. మామూలు వాషింగ్ మెషీన్‌లానే పనిచేసే ఈ వాషింగ్ మెషీన్ కొలతలు 1.28/ 1.32, 1.52 అంగుళాలు మాత్రమే.
1990లలో గిన్నిస్‌లో చోటు సంపాదించుకున్న పాపులర్ హ్యాండ్‌హెల్డ్ టాయ్ అయిన తమగోచి డిజిటల్ పెట్ రికార్డును ఈ వాషింగ్ మెషీన్ తుడిచిపెట్టేసింది. సాజి రూపొందించిన వాషింగ్ మెషీన్ ప్రపంచంలోనే అతి చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంది.
సాజి ఆ మెషీన్లో చిటికెడ్ వాషింగ్ పౌడర్ వేయడం, ఆ వెంటనే అది నీళ్లు తీసుకోవడం వంటివి ఆ వీడియోలో ఉన్నాయి. కాగా, ఇటీవల ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను కూడా భారతీయుడే రూపొందించాడు. ఇది కేవలం 0.65 సెంటీమీటర్లు మాత్రమే ఉంది.