Indian Filter Coffee : పొద్దున లేవగానే కాఫీ లేకుండా ప్రపంచవ్యాప్తంగా మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అయితే కోట్లాది మంది ఇష్టపడే ఈ కాఫీలో ఎన్నో వెరైటీలు, తయారుచేసే పద్ధతులున్నాయి. ఇక ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రపంచంలో టాప్ 38 కాఫీల జాబితాను ప్రకటించింది.
ఈ జాబితాలో క్యూబన్ ఎస్ప్రెసో నెంబర్ 1 స్ధానాన్ని ఆక్రమించగా మన ఇండియన్ ఫిల్టర్ కాఫీకి రెండో ర్యాంక్ దక్కింది. ఇక ఇండియన్ ఫిల్టర్ కాఫీని సులభమైన రీతిలో ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషీన్‌తో సిద్ధం చేస్తారు.
దక్షిణాదిలో ఈ కాఫీ తయారీ పేరొందింది. చాలా మంది వ్యక్తులు రాత్రిపూట ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తారు, దీంతో వారు ఉదయాన్నే తాజాగా తయారుచేసిన కాఫీ మిశ్రమం సిద్ధంగా ఉంచుకుంటారు. ఈ మిశ్రమాన్ని వెచ్చని పాలు మరియు చక్కెరతో కలుపుతారు. చిన్న గ్లాసులో ఈ కాఫీని సర్వ్ చేస్తారు. ఇక టేస్ట్ అట్లాస్ ప్రకటించిన జాబితాలో టాప్ టెన్ కాఫీలను పరిశీలిస్తే..
క్యూబన్ ఎస్ప్రెసో (క్యూబా)
సౌతిండియన్ కాఫీ (ఇండియా)
ఎస్ప్రెసో ఫ్రిడో (గ్రీస్)
ఫ్రిడో క్యాపుచినో (గ్రీస్)
క్యాపుచినో (ఇటలీ)
టర్కిష్ కాఫీ (టర్కీ)
రిస్ట్రెట్టో (ఇటలీ)
ఫ్రాప్ (గ్రీస్)
ఇస్కాఫీ (జర్మనీ)
వియత్నమీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం)
Read More :
Covid Cases: ఢిల్లీ, రాజస్థాన్, యూపీల్లో పెరిగిన కోవిడ్ కేసులు