లక్నో: గంగానదిలో శవాల కలకలం కొనసాగుతూనే ఉన్నది. రోజూ పదుల సంఖ్యలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ ప్రాంతానికి కొన్ని శవాలు కొట్టుకొచ్చాయి. నది ఒడ్డున, నది లోపల పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. కరోనా మృతులకు అంత్యక్రియలు చేయలేక కొంతమంది శవాలను నదిలో పడేస్తున్నారేమోనని గంగానది పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శవాల ద్వారా తమ గ్రామాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తుందేమోనని భయపడుతున్నారు.
Bodies seen in and around river Ganga in Ghazipur, visuals from this morning. pic.twitter.com/MMi6D6q4tu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2021