ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని సూచించింది.
మరోవైపు పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌తో అత్యవసర సమావేశమైన మోదీ.. పాక్ సైనిక చర్యలు, దాడుల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు.