Lalit Patidar | న్యూఢిల్లీ, మార్చి 7 : భారత్‌కు చెందిన లలిత్ పాటిదార్(18) ముఖమంతా జుట్టు కలిగిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అతడి ముఖంపై ప్రతి సెంటీ మీటర్‌కు 201.72 వెంట్రుకలున్నాయని గిన్నిస్ రికార్డ్స్ సంస్థ తేల్చింది. ‘వార్వోల్ఫ్ సిండ్రోమ్’గా పిలిచే ఈ అరుదైన వ్యాధి లక్షణాన్ని కలిగి ఉండటమే లలిత్‌కు గిన్నిస్ రికార్డ్ తెచ్చి పెట్టింది. మధ్య యుగాల కాలం నుంచి ఇప్పటివరకు ఈ తరహా కేసులు కేవలం 50 మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయని గిన్నిస్ రికార్డ్స్ తెలిపింది.