అరుణాచల్ బోర్డర్లో చొరబడ్డ చైనా సైనికులు.. తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో దూసుకువచ్చిన చైనా సైనిక దళాలను భారత ఆర్మీ తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోనూ చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖపై రెండు దేశాలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, అయితే రెండు దేశాల సైనికులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద భారత, చైనా సైనికుల మధ్య కొన్ని గంటల పాటు భౌతిక ఘర్షణ చోటుచేసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ తర్వాత ఇరు దేశాల సైనికులు మళ్లీ వెనుదిరిగినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ఘటనలో భారత రక్షణ దళాలకు ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టమైంది. గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు చైనా దళాలు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేశాయి. ఆ ప్రాంతంలో అనేకసార్లు ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది.
ఉత్తరాఖండ్‌లోని నందాదేవి ఫారెస్ట్ వద్ద ఉన్న బారాహోటి ప్రాంతం సమీపంలో ఆగస్టు 30వ తేదీన చైనా దళాలు చొరబడ్డాయి. అక్కడ ఉన్న వాస్తవాధీన రేఖను దాటి సుమారు 5 కిలోమీటర్ల లోపలికి 100 మంది పీఎల్ఏ సైనికులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. అయితే ఇండో టిబెట్ బోర్డర్ పోలీసులు పహారాకాస్తున్న ఆ ప్రాంతాన్ని కొన్ని గంటల్లోనే పీఎల్ఏ దళాలు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. బారాహోటి ప్రాంతంలో ఇటీవల ఎల్ఏసీ వద్ద పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలకు అక్కడి రేఖ వద్ద భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఆ ఘర్షణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది లడాఖ్‌లో చైనా సైనికులతో ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో.. సుమారు 3500 కిలోమీటర్ల పొడువైన వాస్తవాధీన రేఖ వెంట భారత్ గట్టి పహారా కాస్తున్నది. గత ఏడాది పాన్‌గాంగ్ ఏరియా వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికులు కొట్టుకున్న విషయం తెలిసిందే. లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ పొడుగునా సున్నితమైన ప్రాంతాల్లో భారత్ సుమారు 60 వేల మంది దళాలను మోహరించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

