జమ్ము: జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది రోజులుగా కాల్పులు జరుపుతున్న పాక్ సైన్యం పదో రోజున మరిన్ని సెక్టార్లకు తన చర్యలను విస్తరించింది. శనివారం రాత్రి, ఆదివారం పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని భారత సైన్యాధికారులు తెలిపారు.
పాక్ చిన్న ఆయుధాలతో చేస్తున్న కాల్పులను సమర్థంగా తిప్పి కొట్టామని చెప్పారు. మొదట్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల సరిహద్దుల్లో కాల్పులు మొదలు పెట్టిన పాక్ తాజాగా పూంచ్, అక్నూర్, పర్గ్వల్ సెక్టార్లలోనూ కాల్పులకు తెగ బడుతున్నది.