శ్రీనగర్ : ఉగ్రవాద కార్యకలాపాలను భారత సైన్యం ఉక్కుపాదంతో అణిచి వేస్తోంది. సోపోర్‌లోని హైగాం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భారత బలగాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం, కశ్మీర్ పోలీసులు కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదుల మాడ్యూల్‌ను ఛేదించారు. ముగ్గురు టెర్రరిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మారణహోమం సృష్టించేందుకు, గ్రనేడ్ల దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
బారాముల్లా జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్కో టెర్రర్ మాడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరి నుంచి రూ. 1.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై యూఏపీ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.