న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని దెమ్చోక్ ఘర్షణ ప్రదేశం వద్ద భారత సైన్యం గస్తీ శుక్రవారం ప్రారంభమైంది. డెప్సాంగ్ వద్ద కూడా త్వరలోనే గస్తీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి భారత్, చైనా దళాల ఉపసంహరణ గురువారం పూర్తయింది.
దీపావళి సందర్భంగా భారత్, చైనా సైనికులు గురువారం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి అనేక చోట్ల స్వీట్లను ఇచ్చి, పుచ్చుకున్నారు. ఈ ప్రాంతంలో 2020 ఏప్రిల్ ముందునాటి పరిస్థితిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.