భోపాల్: మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా (Jagdish Devda) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ పాదాలకు సైన్యం నమస్కరిస్తుంది’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత సైన్యాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. శుక్రవారం జబల్పూర్లో జరిగిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతిస్పందించిన ప్రధాని మోదీని ప్రశంసించారు. ‘ప్రధాని మోదీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మొత్తం దేశంతోపాటు మన సైన్యం ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. మోదీ ఇచ్చిన తగిన సమాధానాన్ని ఎంత ప్రశంసించినా సరిపోదు’ అని అన్నారు.
కాగా, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ నేతలు సైన్యాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, సైనికుల త్యాగాలను అవమానిస్తున్నారని ఆరోపించింది. జగదీష్ వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ విమర్శించింది. ‘సైన్యం శౌర్యం, ధైర్యానికి ఇది అవమానం. నేడు దేశం మొత్తం సైన్యం ముందు తలవంచుతుంటే, బీజేపీ నేతలు సైన్యం ధైర్యాన్ని తక్కువ చేస్తున్నారు. తమ తక్కువ ఆలోచనలను వ్యక్తం చేస్తున్నారు’ అని ఎక్స్ పోస్ట్‌లో మండిపడింది.
‘देश की सेना और सैनिक प्रधानमंत्री मोदी के चरणों में नतमस्तक हैं’
• ये बात मध्य प्रदेश की BJP सरकार के उपमुख्यमंत्री जगदीश देवड़ा ने कही है।
जगदीश देवड़ा का यह बयान बेहद ही घटिया और शर्मनाक है।
ये सेना के शौर्य और पराक्रम का अपमान है। जब पूरा देश आज सेना के सामने नतमस्तक… pic.twitter.com/uQmrj40qnj
— Congress (@INCIndia) May 16, 2025