ముంబై: భారత వాయు సేన (ఐఏఎఫ్) యుద్ధ విమానం సుఖోయ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్, షిరస్గావ్ గ్రామం వద్ద కూలిపోయింది. నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపిన వివరాల ప్రకారం, వింగ్ కమాండర్ బోకిల్, సెకండ్ ఇన్ కమాండ్ బిశ్వాస్ ఈ విమానాన్ని నడిపారు. స్వల్పంగా గాయపడిన వీరిద్దరినీ హెచ్ఏఎల్ హాస్పిటల్కు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో చెలరేగిన మంటలను అదుపు చేశారు.