India’s fighter aircraft : పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశ ఎయిర్‌క్రాఫ్ట్ (Air craft) ప్రవేశించడం కలకలం రేపింది. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన C-130 ఎయిర్‌క్రాఫ్ట్ (C-130 air craft) భారత గగనతలం (India’s air space) లోకి ప్రవేశించింది. ఆ వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian air force) అప్రమత్తమైంది.
పరిస్థితిని పరిశీలించేందుకు వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని పంపింది. ఈ యుద్ధ విమానం.. బంగ్లాదేశ్ ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి ఆ దేశ ఎయిర్‌స్పేస్‌లోకి వెళ్లేవరకు ఓ కన్నేసి ఉంచింది. కాగా, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన వర్గాలు తెలిపాయి.