బహిరంగ ప్రాంతాల్లోనూ హిజాబ్ బ్యాన్!
రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో హిజాబ్‌పై నిషేధం విధించాలని ఐరోపా దేశాలు ఇప్పటికే యోచిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
- బీజేపీ నేత యశ్పాల్ సువర్ణ
బెంగళూరు, ఏప్రిల్ 22: రానున్న రోజుల్లో కాలేజీల్లోనే కాకుండా బహిరంగ ప్రాంతాల్లో కూడా హిజాబ్ధారణపై నిషేధం విధించే అవకాశమున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి యశ్పాల్ సువర్ణ అన్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో హిజాబ్‌పై నిషేధం విధించాలని ఐరోపా దేశాలు ఇప్పటికే యోచిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘హిందూ దేశ సాధన కోసం కలలుకంటున్న మనం.. బహిరంగ ప్రాంతాల్లో హిజాబ్‌పై నిషేధాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హిజాబ్ ధరించారని పరీక్షలకు అనుమతి నిరాకరణ
కర్ణాటకలో పీయూసీ(ఇంటర్) సెకండియర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. విద్యాలయాల్లో హిజాబ్ సహా అన్ని మతపరమైన వస్ర్తాలపై కర్ణాటక హైకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ తొలగించి పరీక్షలు రాశారు. హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన రేషమ్, ఆలియా పరీక్షలు రాయకుండానే వెనుదిరిగారు. మే 18వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ban
- BJP leader
- hijab
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

