Military Strength | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఒప్పందాల నిలిపివేత, పౌరుల గెంటివేత వంటి కఠిన నిర్ణయాలను ఇరు దేశాలూ తీసుకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య సైనిక చర్య ఉండొచ్చన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయుధ సంపత్తి, సైన్యం పరంగా ఏ దేశం శక్తిమంతంగా ఉందన్నదానిపై చర్చ మొదలైంది. గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం.. సైనిక శక్తి జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా.. పాక్ 12వ స్థానానికి పరిమితమైంది. దీంతో ఆయుధ సంపత్తి, సైనిక శక్తి విషయంలో పాక్ కంటే భారత్ ఎంతో ముందంజలో ఉన్నట్టు అర్థమవుతున్నది.