BrahMos Missile: బహ్మోస్ మిస్సైల్ కొనుగోలుకు ఇండోనేషియా ఒప్పందం.. సంతకం చేసిన ప్రధాని మోదీ
BrahMos Missile: సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను ఇండోనేషియా కొనుగోలు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు.
బ్యాంకాక్: బ్రిక్స్ సభ్య దేశం ఇండోనేషియాకు సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణు(BrahMos Missile)లను అమ్మేందుకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. బ్రహ్మోస్ తో పాటు ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ కొనుగోలుపై కూడా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటితో పాటు అనేక రక్షణ, ఆర్థిక రంగాల్లో సహకారం కొనసాగనున్నది. బ్రహ్మోస్‌కు చెందిన రెండు బ్యాటరీ సిస్టమ్‌లను ఇండియా సరఫరా చేయనున్నది. ఆ క్షిపణి విలువ సుమారు 200 మిలియన్ల డాలర్లు ఉంటుంది. బ్రహ్మోస్ బ్యాటరీలో మొత్తం నాలుగు లాంచర్లు, 12 రెడీ టు ఫైర్ క్షిపణులు ఉంటాయి. వీటితో పాటు కొంత ఎక్విప్మెంట్, వెహికిల్స్ కూడా ఉంటాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు కూడా బ్రహ్మోస్‌ను అమ్మేందుకు త్వరలో ఆ దేశాలతో ఇండియా ఒప్పందం కుదుర్చుకోనున్నది.
ఇండియా, రష్యా దేశాలు సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని డెవలప్ చేస్తున్నాయి. భారత్‌లోని బ్రహ్మాపుత్రి, రష్యాలోని మోస్కావ్ నదుల పేరు నుంచి బ్రహోస్ను నామకరణం చేశారు. ధ్వని వేగం కన్నా అధిక స్పీడ్‌తో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి ఇది. బ్రహ్మోస్ కొనుగోలుపై మోదీ, ప్రబోవో సుబియాంటో సంతకం చేశారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు ఈ క్షిపణిని అమ్మారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఆస్ట్రాను కూడా ఇండోనేషియా కొనుగోలు చేయనున్నది. డీఆర్డీవో దీన్ని డెవలప్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వైమానిక దళం దీన్ని వినియోగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

