న్యూఢిల్లీ, ఆగస్టు 10: అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,754 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6,611 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
గత త్రైమాసికంలో ఫైనాన్స్ చెల్లింపులకోసం రూ.5,120 కోట్ల నిధులు వెచ్చించింది. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6 శాతం ఎగబాకి రూ.11,689 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థకు 19.31 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.