న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.190.94 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.164.8 కోట్ల లాభంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షాకాలంలో కంపెనీ రూ.4,214.54 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది.
2025-26 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.3,401.08 కోట్ల ఆదాయాన్ని గడించినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం రూ.3,190.66 కోట్ల స్థాయి లో ఉన్న కంపెనీ నిర్వహణ ఖర్చులు ఈసారికిగాను రూ.3,979.41 కోట్లకు పెరిగాయి. సంస్థకు వచ్చిన ఆదాయంలో యాసిడ్ బ్యాటరీలు, అనుబంధ ప్రొడక్ట్‌ల విభాగాల నుంచి రూ.4,005.24 కోట్ల ఆదాయం సమకూరగా, న్యూ ఎనర్జీ విభాగం నుంచి రూ.209.30 కోట్ల ఆదాయం లభించింది.