దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. సోమవారం ‘ఎవరే నువ్వే..’ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు సనారే సాహిత్యాన్ని అందించారు.
అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సినిమాలో డాన్ జాన్ అనే అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు దుల్కర్ సల్మాన్. దక్షిణభారతదేశంలోని దాదాపు 100కుపైగా లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ జరిపామని, ఇందులో అల్ట్రా ైస్టెలిష్ డాన్‌గా దుల్కర్ సల్మాన్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.