Miss World | 28 ఏండ్ల తర్వాత భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. ఎక్కడంటే..?
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్‌లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించనున్నారు.
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్‌లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఈ ఈవెంట్‌ను ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ చేయనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించనున్నారు. ఫైనల్స్ మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా రాత్రి 7:30 నుంచి 10:30 వరకు జరగనున్నాయి.
ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధం కావాలని మోర్లే పిలుపునిచ్చారు.
భారత్‌లో చివరిసారిగా 1996లో బెంగళూరు వేదికగా ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించారు. 1996లో భారత్‌కు చెందిన రీటా ఫారియా పోవెల్ తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడేన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మనూషి చిల్లర్ మిస్ వరల్డ్‌గా నిలిచారు.
2022లో చివరిసారిగా నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని బహుకరించనున్నారు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు.
Chairman of Miss World, Julia Morley CBE stated “Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose
— Miss World (@MissWorldLtd) January 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

