న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, చీనాబ్ నదిపై భారత్ భారీ జల విద్యుత్తు ప్రాజెక్ట్ నిర్మించబోతున్నది. రూ.5,129 కోట్ల విలువైన సావల్కోట్ జల విద్యుత్తు ప్రాజెక్ట్ పనులను కేంద్రం ప్రారంభించింది.
జమ్ముకశ్మీర్ ఉధంపూర్-రాంబాన్ జిల్లాలో ఈ మెగా ప్రాజెక్ట్ను నిర్మించడానికి ఫిబ్రవరి 5న పలు కంపెనీల నుంచి నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) బిడ్లను ఆహ్వానించింది.