న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాలకు భారత భూభాగం గుండా రవాణా చేసుకోవడానికి బంగ్లాదేశ్‌కు ఇచ్చిన అనుమతిని భారత ప్రభుత్వం మంగళ వారం రద్దు చేసింది. ఇండియన్ లాండ్ కస్టమ్స్ స్టేషన్స్ (ఎల్సీఎస్), నౌకాశ్రయాలు, విమానాశ్రయాల గుండా నేపాల్, భూటాన్, మయన్మార్లకు బంగ్లాదేశ్ వివిధ వస్తువులను రవాణా చేస్తుండేది.
దీనిని రద్దు చేస్తూ పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డు మంగళవారం సర్క్యులర్‌ను జారీ చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఇటీవల చైనాలో నాలుగు రోజులపాటు పర్యటించారు. ఈశాన్య రాష్ర్టాల చుట్టూ భూమి మాత్రమే ఉందని, సముద్రానికి చేరుకునే మార్గం లేదని చెప్పారు.