Parvathaneni Harish: విద్వేష ఫ్యాక్టరీ.. యూఎన్‌లో పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా
Parvathaneni Harish: ఫిత్నా అల్ హిందుస్తాన్ ఉగ్ర సంస్థ విధ్వంసం సృష్టిస్తున్నట్లు యూఎన్‌లో పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి భారత్ కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశాన్ని బద్నాం చేయడం పాకిస్థాన్‌కు అలవాటైందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఆరోపించారు. విద్వేష ఫ్యాక్టరీగా పాక్ మారిందన్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తమ దేశంలో ఉన్న మిలిటెంట్ల గ్రూపునకు ఫిత్నా అల్ హిందుస్తాన్ అని పేరు పెట్టింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సరిహద్దు పోరులో ఆ సంస్థ విధ్వంసానికి పాల్గొన్నట్లు పాక్ పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్ ఆ ఆరోపణలు చేసింది. దానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆ ఉగ్రవాద గ్రూపును నిర్వహిస్తున్నట్లు భారత ప్రతినిధి యూఎన్‌లో పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై జరుగుతున్న చర్చ సమయంలో పాక్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండించింది.
యూఎన్‌లోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్(Parvathaneni Harish) మాట్లాడుతూ.. న్యూఢిల్లీని కళంక పరిచేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. పాకిస్థాన్ అల్లిన కథను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్థాన్ తన కల్పిత కథలతో ఆ దేశ ప్రజలను, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తమ స్వంత దేశంలోనే ఉగ్ర సంస్థలకు హిందుస్తాన్ అని పేరు పెట్టి, తప్పుడు సమాచారాన్ని పాక్ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.
భారత్‌పై విద్వేషాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే పాక్ ఈ కుట్రలు పన్నుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్వేషాన్ని సృష్టిస్తున్న ఫ్యాక్టరీగా పాక్ మారినట్లు ఆరోపించారు. పాకిస్థాన్ తన రాజకీయ, ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌పై ఆరోపణలు చేస్తున్నట్లు పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉన్నట్లు తెలిపారు.
Today I delivered India’s statement at the UNSC meeting on the situation in Afghanistan. I made the following 🔟 points:
1️⃣ Highlighted that India’s capacity building and Humanitarian Assistance initiatives for the Afghan people can be seen in all 34 provinces and in more than… https://t.co/fFnGbEhPk3
— Parvathaneni Harish (@AmbHarishP) June 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

