న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : భారతసైన్యం సోమవారం బంగాళాఖాతంపై చేపట్టిన దీర్ఘశ్రేణి ‘బ్రహ్మోస్’ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ మిస్సైల్, పనితీరు, సామర్థ్యాన్ని సదరన్ కమాండ్‌కు చెందిన బ్రహ్మోస్ యూనిట్ పరీక్షించింది.
క్షిపణి తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని, పయనించిన మార్గం, నియంత్రణ వ్యవస్థలు బాగా పనిచేశాయని భారత ఆర్మీ తెలిపింది.