న్యూఢిల్లీ, మే 29: గగనతలం నుంచి భూతలంపై లక్ష్యాల్ని ఛేదించగల రుద్ర క్షిపణి ప్రయోగాన్ని భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఫైటర్ జెట్ నుంచి చేపట్టిన రుద్ర క్షిపణి ప్రయోగం సక్సెస్ అయినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డీఆర్డీవో సైంటిస్టులు ‘రుద్ర ఎం-2’ క్షిపణిని తయారుచేశారు.