(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ ): ప్రతీకార చర్యల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి భారత సైన్యం చేసిన దాడిలో కరాచీ పోర్టు తీవ్రంగా నాశనమైందంటూ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని పాక్ స్వయంగా ఒప్పుకొన్నది.
భారత్ చేసిన దాడుల్లో కరాచీ పోర్టు తీవ్రంగా నాశమైనట్టు పాక్ కరాచీ పోర్ట్ ట్రస్ట్ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఉదయం ఓ పోస్ట్ కనిపించింది. ఇది కాస్తా వైరల్ కావడంతో సదరు పోస్ట్‌ను డిలీట్ చేసిన అధికారులు తమ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ చెప్పుకొచ్చారు. దీంతో నిజంచెప్పి పాక్ నాలుక్కరుచుకొన్నదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.