Rajnath Singh | అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్దంగా ఉన్నాం : రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ (Defence Minister) మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఏఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0 (National Security Summit 2.0) లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి (Union Govt) ఈ వ్యాఖ్యలు చేశారు.
Rajnath Singh : పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ (Defence Minister) మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఏఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0 (National Security Summit 2.0) లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి (Union Govt) ఈ వ్యాఖ్యలు చేశారు. సామర్థ్యం లేక ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ను ఆపేయలేదని, అది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయమని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ మన సాయుధ దళాల సమైక్యతకు కూడా ఒక ఉదాహరణ అని, ఇందులో మన త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్లాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సొంత నిబంధనల ప్రకారమే ఆపరేషన్‌ను ప్రారంభించి సరైన సమయంలోనే దాన్ని ముగించామని, అది స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉగ్రవాదం మానవత్వానికి మాయని మచ్చ అని చెప్పారు. దీనిపై పోరాటం కేవలం భద్రతకు సంబంధించిన విషయమే కాదని, మానవత్వపు మౌలిక విలువలను పరిరక్షించేందుకని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశాన్ని అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా అభివర్ణించారు. ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, దానికి బహుముఖ కోణాలు ఉన్నాయని అన్నారు. దాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాక్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రమైతే.. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కేంద్ర బిందువుగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

