న్యూఢిల్లీ, డిసెంబర్ 11: విపక్ష పాలిత రాష్ర్టాలను ఆర్థికంగా దిగ్బంధించడం తగదని ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిరసన వ్యక్తం చేశాయి. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ, జనతాదళ్(యునైటెడ్), డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, వామపక్షాలు, శివసేన(యూబీటీ) తదితర పార్టీల ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్ష పాలిత రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఆర్థిక దిగ్భందం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ తెలిపారు.
నిధులివ్వండి.. లేదంటే దిగిపోండి
కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. అలీపూర్‌దౌర్‌లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బెంగాల్‌కు వెంటనే కేంద్రం నిధులు విడుదల చేయాలని లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధానితో చర్చించేందుకు ఈ నెల 17న ఆయన అపాయింట్మెంట్ కోరానని ఆమె తెలిపారు. ఓబీసీలకు కేంద్రం నిధులను ఆపేసిందని ఆరోపించారు.