500 కిలోల డ్రగ్స్ సీజ్
అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
- అరేబియా సముద్రంలో భారత్
- శ్రీలంక సంయుక్త ఆపరేషన్
న్యూఢిల్లీ, నవంబర్ 29: అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. శ్రీలంక జెండాలతో ప్రయాణిస్తున్న రెండు పడవలపై శ్రీలంక నేవీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరు దేశాల నేవీలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టు భారత నేవీ ప్రకటించింది. న్యాయపరమైన చర్యల కోసం పట్టుబడిన డ్రగ్స్, పడవలు, వాటిలోని సిబ్బందిని శ్రీలంకకు అప్పగించినట్టు వెల్లడించింది.
62 దేశాల ఆపరేషన్.. 1,400 టన్నుల డ్రగ్స్ పట్టివేత
62 దేశాలు కలిసి చేపట్టిన ‘ఆపరేషన్ ఓరియన్’లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. ఆరు వారాల పాటు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో 225 టన్నుల కొకైన్, 1000 టన్నుల మరిజువానాను కొలంబియా సహా వివిధ దేశాల నౌకా దళాలు సీజ్ చేశాయి. ఇంత భారీ ఎత్తున కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి. డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తున్న ఆరు జలా ంతర్గాములను సీజ్ చేశారు. డ్రగ్స్ రవాణాతో సంబంధమున్న 400 మందిని అరెస్టు చేశారు. దక్షిణ అమెరికా నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేస్తున్న కొత్త పసిఫిక్ సముద్ర దారిని ఈ ఆపరేషన్‌లో గుర్తించినట్టు కొలంబియా నేవీ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

