న్యూఢిల్లీ, జవనరి 13: సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందంపై భారత్ సోమవారం సంతకం చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,028 మంది యాత్రికులు హజ్‌కు వెళ్లడంపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ అరేబియాకు చెందిన హజ్, ఉమ్రా మంత్రి థౌఫిఖ్ బీన ఫాజాన్ అల్ రబయ్యా జెడ్డాలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సౌదీ అరేబియాతో హజ్ ఒప్పందం 2025పై సంతకం చేసినట్టు రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. హజ్ 2025 కోసం భారత్ కోటాగా 1,75,025 మంది యాత్రికులను ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. మన దేశ హజ్ యాత్రికులు అందరికీ అత్యుత్తమ సేవలు అందచేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. కాగా, ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు.