న్యూఢిల్లీ: దేశంలో కరోనా (corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి. ఇందులో 1,45,582 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,42,95,407 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,81,893 మంది మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 10,846 మంది కరోనా నుంచి కోలుకోగా, 123 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 1,45,68,89,304 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
ఇక ఒమిక్రాన్ బాధితులు కూడా నానాటికి పెరుగుతున్నారు. ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. దేశంలోని ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్ 136, తమిళనాడు 121, రాజస్థాన్ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున నమోదయ్యాయి.