న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా, 2,060 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా మహమ్మారికి పది మంది బలవగా… మొత్తం మరణాల సంఖ్య 5,28, 905కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది.