న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,22,473కు చేరాయి. ఇందులో 4,20,86,383 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,11,903 మంది మరణించారు. మరో 2,24,187 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, కరోనా మూడో వేవ్ ప్రారంభమైనతర్వాత 20 వేల లోపు పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
ఇక గత 24 గంటల్లో 48,847 మంది కరోనా నుంచి కోలుకోగా, 673 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.52 శాతమని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,75,37,22,697 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.