న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,192 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం రోజు 2,09,918 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 959 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చితే ఇవాళ కరోనా కేసులు 42 వేలకు తగ్గాయి. అయితే మృతుల సంఖ్య నిన్నటితో పోల్చితే వెయ్యికి పైగా పెరిగింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4,96,242కు చేరింది.
డైలీ పాజిటివిటీ రేలు 15.77 శాతం నుంచి 11.9 శాతానికి తగ్గింది. వీక్లీ పాజిటివిటీ రేటు 15.75 శాతం నుంచి 15.25 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 17,43,059కి చేరింది. కరోనా నుంచి 2,54,076 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94.60 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 14,28,672 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 73 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.