న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Corona) కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 13 వేల కేసులు నమోదవగా, కొత్తగా అవి 15 వేలు దాటాయి. రోజువారీ కేసులు తగ్గడం, కోలుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా దిగివస్తున్నాయి.
దేశంలో కొత్తగా 15,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితులు 4,28,67,031కి చేరారు. ఇందులో 4,21,89,887 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,12,622 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,64,522 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, గత 24 గంటల్లో కొత్తగా 278 మంది మృతిచెందగా, 31,377 మంది కోలుకున్నారని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసులు 0.38 శాతం ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,76,19,39,020 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.