న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరింది. ఇందులో 1,61,334 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,36,27,632 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 4,57,191 మంది మరణించారని తెలిపింది. గత 24 గంటల్లో 13198 మంది కరోనా నుంచి బయట పడ్డారని, మరో 805 మంది మృతిచెందారని వెల్లడించింది.
ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు 1,04,82,00,966 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. కాగా, కరోనా రికవరీ రేటు 98.19 శాతం ఉందని, మొత్తం కేసుల్లో 0.47 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది.