న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు (Corona cases) క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ అధికమయ్యాయి. బుధవారం 11 వేల పైచిలుకు నమోదవగా, తాజాగా అవి 13 వేలు దాటాయి. ఇవి బుధవారం నాటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health)వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కొత్తగా 13,091 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,670కి చేరింది. ఇందులో 3,38,00,925 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,38,556 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,62,189 మంది మృతిచెందారు. గత యాక్టివ్ కేసుల సంఖ్య గత 266 రోజుల్లో ఇదే కనిష్టమని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక గత 24 గంటల్లో 340 మంది మరణించాగా, 13,878 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా కేసుల్లో కేరళలోనే సగానికిపైగా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 7,540 కేసులు నమోదవగా, 259 మంది కరోనాకు బలయ్యారు.