న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు (Covid-19) మళ్లీ 10 వేలు దాటాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 9 వేలు, అంతకంటే తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. అయితే నేడు 10 వేలకుపైగా నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా 10,549 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,45,55,431కి పెరిగాయి. ఇందులో 3,39,77,830 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి వల్ల 4,67,468 మంది మృతిచెందారు. మరో 1,10,133 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 488 మంది మృతిచెందగా, 9868 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో గురువారం.. 5987 కేసులు నమోదవగా, 384 మంది మృతిచెందారని వెల్లడించింది.