న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1054 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,35,271కి చేరాయి. ఇందులో 4,25,02,454 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 5,21,685 మంది మృతిచెందారు. 11,132 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 1258 మంది వైరస్ నుంచి బయటపడగా, 29 మంది మరణించారు.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,85,70,71,655 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో శనివారం ఒక్కరోజే 14,38,792 మంది టీకా తీసుకున్నారని పేర్కొన్నది.