Indus Waters Treaty | సింధు నదీ జలాల ఒప్పందంపై మధ్య మధ్యవర్తిత్వానికి నో.. సీఓఏకు హక్కు లేదన్న ఇండియా
Indus Waters Treaty : సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో మధ్యవర్తిత్వానికి ఇండియా నో చెప్పింది. ఈ అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యాన్ని ఇండియా తప్పుబట్టింది.
Indus Waters Treaty : సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో మధ్యవర్తిత్వానికి ఇండియా నో చెప్పింది. ఈ అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జోక్యాన్ని ఇండియా తప్పుబట్టింది. ఇది చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేసింది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది.
దీంతో ఇండియా నుంచి పాకిస్తాన్ సింధు నదీ ప్రవాహం నిలిచిపోయింది. సింధు నదీ జలాలు రాకపోవడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ నది నీళ్లు విడుదల చేయాలని ఇండియాపై బెదిరింపులకు దిగుతోంది. అలాగే, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతోంది. తాజాగా, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశంపై ప్రపంచ బ్యాంకుకు చెందిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఓఏ) జోక్యం చేసుకుంది. తాజాగా సింధు నది అంశంపై ఇండియాకు కీలక సూచనలు చేసింది. ఇండియా నిర్ణయాన్ని తప్పుబట్టింది.
‘‘పాకిస్తాన్తో సింధు నదీ జలాలా ఒప్పందాన్ని ఇండియా పూర్తిస్థాయిలో అమలు చేయాలి. గత ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకోవడానికి ఇండియా చెబుతున్న కారణాలు న్యాయబద్ధంగా లేవు’’ అంటూ సీఓఏ పేర్కొంది. ఇండియా తన ఒప్పందాన్ని కొనసాగించాలని సూచించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. అసలు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు సీఓఏకు లేదని తేల్చి చెప్పింది. సీఓఏకు ఎలాంటి చట్టబద్ధతా లేదని పేర్కొంది.
‘‘సీఓఏను ఇండియా ఎప్పుడూ న్యాయబద్ధమైన సంస్థగా గుర్తించలేదు. ఈ సంస్థ ఆదేశాల్ని, సూచనల్ని ఇండియా అంగీకరించబోదు. గతంలో కూడా ఎప్పుడూ సీఓఏ ముందు హాజరుకాలేదు. దేని కోసం ఈ సంస్థను ఆశ్రయించలేదు. భారత సార్వభౌమ అధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం సీఓఏకు లేదు. ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఈ సంస్థ ఇచ్చే ఆదేశాలు, తీర్పులను ఇండియా పరిగణనలోకి తీసుకోదు. అవి భారత చర్యలు, ప్రాజెక్టుల్ని ఆపలేవు’’ అని ఇండియా స్పష్టంగా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CoA
- India
- Indus Waters Treaty
- MEA
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

