
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో కరోనా కేసులు ఇటీవలితో పోలిస్తే తగ్గుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో 1,67,059 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,192 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,14,69,499కి చేరగా, మరణాల సంఖ్య 4,96,242కి పెరిగింది. యాక్టివ్ కేసులు 17,43,059కి తగ్గాయి. రికవరీ రేటు 94.60గా ఉన్నది. రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.