Modi : ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన న్యూయార్క్‌కు చేరుకున్నారు. శనివారం డెలావేర్లో జరిగిన ‘క్యాన్సర్ మూన్‌షాట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ న్యూయార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడ జరిగిన కమ్యూనిటీ ఈవెంట్లో ప్రధాని పాల్గొన్నారు. న్యూయార్క్‌లో ‘మోదీ & యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ (IACU) భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14 వేల మంది హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు పాల్గొన్నారు.
500 మంది కళాకారులు, 350 మంది వాలంటీర్లు, 85 మీడియా వర్గాలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రవాస భారతీయులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
బైడెన్‌కు బహుమతి
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. డెలావేర్‌లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జో బైడెన్‌కు మోదీ వెండితో చేసిన రైలు నమూనాను బహుమతిగా ఇచ్చారు. ఆ రైలు నమూనాపై ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉంది. దాన్ని మహారాష్ట్రకు చెందిన కళాకారులు తయారుచేశారు.
Silver Train Model