న్యూఢిల్లీ: అత్యవసర వైద్య రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఎయిర్ అంబులెన్సు సర్వీసులను భారత్ త్వరలో ప్రవేశపెట్టనున్నది. రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్, ల్యాండింగ్(వీటీఓఎల్) అయ్యే ఎయిర్ అంబులెన్సు సర్వీసులున్న కొద్ది దేశాలలో భారత్ కూడా త్వరలో చేరనున్నది.
ఐఐటీ మద్రాస్ స్టార్టప్ ఈప్లేన్, ప్రముఖ అంబులెన్సు సంస్థ ఐక్యాట్ మధ్య రూ. 8,684 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 788 ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్సులను ఈప్లేన్ అందచేయాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్సును అందుబాటులో ఉంచుతారు. దేశంలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. 2026 చివరి నాటికి మొదటి విడతగా కొన్ని ఎయిర్ అంబులెన్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.