తిరువనంతపురం: పాకిస్తాన్‌పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్‌కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Sashi Tharoor) తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అప్పుడు బలంగా తిప్పికొడుతామని ఆయన అన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, దానికి తగినట్లు బదులు ఇచ్చామన్నారు. ఉగ్రవాదుల బేస్ క్యాంప్‌ను టార్గెట్ చేసి, సాధారణ పౌరుల్ని ఇబ్బంది పెట్టకుండా దాడి చేశామన్నారు. పూంచ్ వద్ద పాకిస్థాన్ చేస్తున్న ఫైరింగ్‌లో 15 మంది మృతిచెందారని, 59 మంది గాయపడ్డారని, మన దళాలు వాటిని తిప్పికొడుతున్నాయని శశిథరూర్ తెలిపారు.