క్రైస్ట్‌చర్చ్: భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. రాబోయే అయిదేళ్ల కోసం రెండు దేశాల కొత్త టార్గెట్‌ను నిర్దేశించుకున్నాయి. 2030 నాటికి సుమారు 35వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ(PM Modi), కివీస్ ప్రధాని కిస్టోఫర్ లుక్సాన్ మధ్య దీనిపై ఒప్పందం జరిగింది. ప్రతి రంగంలోనూ నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇండో పసిఫిక్ సంబంధాలపై కూడా ఇరు దేశ ప్రధానులు సంయుక్త ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సముద్ర మార్గాలను వినియోగించుకోవాలని కూడా తమ ఒప్పందంలో రాసుకున్నారు. మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం ఆక్లాండ్ చేరుకున్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య అగ్రిమెంట్ జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. స్థానిక తెగ మావోరిలు.. సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
PM Modi gets a roaring Māori Haka welcome in New Zealand! 🇳🇿🔥
Traditional warrior dance honours India’s global leader on his historic visit. Cultures unite, bonds strengthen! pic.twitter.com/waEw8RJVNt
— Raghu (@IndiaTales7) July 11, 2026