న్యూఢిల్లీ: హెచ్-1బీపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం కుటుంబాలకు అంతరాయం కలిగించడం ద్వారా మానవతాపరమైన ప్రభావాలు చూపవచ్చునని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ పెంపు ప్రభావం వల్ల సంభవించే పరిణామాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, అమెరికా యంత్రాంగం దీనిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది.
ఆవిష్కరణ, సృజనాత్మకతలో భారత దేశం, అమెరికా రెండూ వాటా కలిగి ఉన్నాయని, రెండు వైపులా ముందుకు సాగడానికి ఉత్తమ మార్గంపై సంప్రదింపులు జరపాలని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు.