న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 9560 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.62 శాతం, మరణాల రేటు 1.19 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా 211.91 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులన పంపిణీ చేశామని ప్రకటించింది.