న్యూఢిల్లీ: భారత అమ్ముల పొదిలో మరో అత్యాధునిక క్షిపణి చేరింది. 2 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ విజయంతో దేశంలోని ప్రతి మూల నుంచి క్షిపణులను ప్రయోగించగలిగే సత్తా భారత్‌కు సమకూరింది.
స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) సహకారంతో డీఆర్ఆడీవో ఈ మధ్యంతర శ్రేణి అగ్ని ప్రైమ్ మిసైల్‌ను బుధవారం విజయవంతంగా పరీక్షించింది. రైల్ నెట్వర్క్ నుంచి క్షిపణులను ప్రయోగించే దేశాల జాబితాలో భారత్ చేరింది.